Share News

Shravan శ్రావణ శోభ

ABN , Publish Date - Aug 15 , 2025 | 11:36 PM

The Splendor of Shravan శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా జిల్లా వాసులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టారు. ప్రధానంగా మహిళలు ఇళ్ల వద్ద విశేష పూజలు, వ్రతాలు చేశారు. ఆ తర్వాత దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలు చేశారు.

 Shravan శ్రావణ శోభ
పాలకొండ కోటదుర్గమ్మ ఆలయంలో కుంకుమపూజలు చేస్తున్న మహిళలు

  • అంతటా ప్రత్యేక పూజలు, కుంకుమార్చనలు

పాలకొండ, ఆగస్టు15(ఆంధ్రజ్యోతి): శ్రావణమాసం నాలుగో శుక్రవారం సందర్భంగా జిల్లా వాసులు ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి ఆలయాలకు క్యూ కట్టారు. ప్రధానంగా మహిళలు ఇళ్ల వద్ద విశేష పూజలు, వ్రతాలు చేశారు. ఆ తర్వాత దేవాలయాల్లో అమ్మవార్లను దర్శించుకుని సామూహిక కుంకుమార్చనలు చేశారు. ఉత్తరాంరఽధుల ఆరాధ్యదైవం పాలకొండ కోటదుర్గమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. ప్రధాన అర్చకుడు డి.లక్ష్మీ ప్రసాదశర్మ ఆధ్వర్యంలో మహిళలు సామూహిక కుంకుమార్చనలు, లలితాసహస్ర నామార్చనలు నిర్వహించారు. అనంతరం వాహన పూజలు, విధ్యాబ్యాసాలు, అన్నప్రాసన పెద్దఎత్తున చేపట్టారు. ఈవో వీవీ సూర్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. సాలూరు, పార్వతీపురం, కురుపాంలోని ప్రముఖ ఆలయాల్లోనూ శ్రావణ శోభ వెల్లివిరిసింది.

Updated Date - Aug 15 , 2025 | 11:36 PM