Share News

తండ్రిని చంపిన కొడుకు అరెస్టు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:28 AM

తండ్రిని చంపిన కొడుకు పొయిరి సింహాచలంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.

తండ్రిని చంపిన కొడుకు అరెస్టు

సాలూరు, డిసెంబరు22 (ఆంధ్రజ్యోతి): తండ్రిని చంపిన కొడుకు పొయిరి సింహాచలంను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు. సాలూరు పీఎస్‌లో సోమవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంతో కేసు వివరాలను సీఐ రామ కృష్ణ వెల్లడించారు. పాచిపెంట మండలం తుమరావల్లి పంచాయతీ నేరేడు వలస గ్రామానికి చెందిన పొయిరి సోమయ్య(56) ఈనెల 18న అనుమా నాస్పద స్థితిలో మృతి చెందాడని చిన్న కొడుకు ఎరకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు. పొయిరి సోమయ్య పాచిపెంట మండలం తుమరావల్లి పంచాయతీ నేరేడువలస గ్రామానికి చెందినవారు. అతడికి కుమా ర్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె లక్ష్మిని శతాబి గ్రామానికి చెందిన శ్రీరామ్‌కు ఇచ్చి వివాహం చేశారు. చిన్న కుమారుడు ఎరకయ్య శతాబి గ్రామానికి చెందిన మహిళను వివాహం చేసుకుని ఇల్లరికం ఉంటున్నాడు. మరో కుమారుడు పొయిరి సింహాచలం నేరేడువలస గ్రామానికి చెందిన సారా గౌర మ్మను వివాహం చేసుకున్నాడు. ఐదేళ్లుగా గౌరమ్మ విడిగా ఉంటోంది. సింహాచ లం తల్లిదండ్రులతో ఉంటున్నాడు. అయితే మూడేళ్ల కిందట సోమయ్య భార్య లచ్చమ్మ మృతి చెందింది. దీంతో తండ్రి కొడుకులు ఒకే ఇంటిలో నివాసం ఉంటున్నారు. భార్య మృతితో సోమయ్య మానసికంగా కుంగిపోయాడు. వికృతంగా ప్రవర్తించేవాడు. ఈ నెల 17న గ్రామంలో గంగమ్మతల్లి పండుగ సమయంలో భోజనం చేస్తున్న సింహాచలాన్ని తండ్రి సోమయ్య వెనకనుంచి కాలుతో తన్నాడు. అక్కడ పడిపోయిన సింహాచలం దాంతో అక్కడే ఉన్న కర్రతో మెడపై రెండు దెబ్బలు కొట్టడంతో అక్కడిక్కడే సోమయ్య మృతి చెందాడు. దాంతో చిన్న కుమారుడు ఎరకయ్య ఈ నెల 18న పాచిపెంట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుమారుడు సింహాచలం కొట్టడంతోనే మృతి చెందాడని నిర్ధారణ చేశారు. దీంతో సింహాచలాన్ని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:28 AM