ఎస్‌ఐని సస్పెండ్ చేయాలి
ABN , Publish Date - Mar 11 , 2025 | 12:20 AM
అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.

బెలగాం, మార్చి 10 (ఆంధ్రజ్యోతి) :అన్నమయ్య జిల్లా రాయచోటిలో వీరభద్ర స్వామి ఉత్సవాల ఊరేగింపులో భక్తులపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని, రాయచోటి ఎస్‌ఐని సస్పెండ్ చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పార్వతీపురం కలెక్టరేట్ వద్ద వీహెచ్‌పీ ఆధ్వర్యంలో దాడికి వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు. ఈసందర్భంగా ఓ వర్గం భక్తులపై దాడి చేసిందని, వారిని అదుపుచేయలేక పోలీసులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నామని పేర్కొన్నారు.