Share News

The services of police martyrs are memorable. పోలీస్‌ అమరవీరుల సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Oct 22 , 2025 | 12:18 AM

The services of police martyrs are memorable. ప్రజల రక్షణకోసం ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలోని స్మృతి వనంలో అమర వీరులకు ఘన నివాళి అర్పించారు.

The services of police martyrs are memorable. పోలీస్‌ అమరవీరుల సేవలు   చిరస్మరణీయం
అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పిస్తున్న కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి, జిల్లా న్యాయాధికారి బబిత, ఎస్పీ దామోదర్‌

పోలీస్‌ అమరవీరుల సేవలు

చిరస్మరణీయం

కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి

స్మృతి వనంలో ఘన నివాళి

విజయనగరం క్రైం, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): ప్రజల రక్షణకోసం ప్రాణాలు అర్పించిన పోలీస్‌ అమరవీరుల సేవలు చిరస్మరణీయమని కలెక్టర్‌ రామసుందర్‌ రెడ్డి అన్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పోలీస్‌ కార్యాలయ ప్రాంగణంలోని స్మృతి వనంలో అమర వీరులకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌ విధుల నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన వారు చిరస్థాయిగా నిలుస్తారన్నారు. వారి సాహసం సదా స్ఫూర్తిదాయకమని చెప్పారు. జిల్లా న్యాయాధికారి ఎం.బబిత మాట్లాడుతూ దేశంలో మావోయిజం తీవ్రంగా ఉన్న సమయంలో మావోయిస్టులతో వీరోచిత పోరాటం చేసి ఎంతోమంది పోలీస్‌ అధికారులు, సిబ్బంది ప్రాణాలను తృణప్రాయంగా అర్పించారని గుర్తుచేశారు. ఎస్పీ దామోదర్‌ మాట్లాడుతూ పోలీస్‌, పారా మిలటరీ దళాలు శాంతిభద్రత పరిరక్షణలో సంఘవిద్రోహ శక్తులతో పోరాటాలు చేయటంతోనే తీవ్రవాద కార్యకలాపాలు తగ్గుముఖం పట్టి నేడు మనమంతా స్వేచ్ఛగా, శాంతియుతంగా ఉండగలుగుతున్నామన్నారు. అనంతరం మావోయిస్టుల కాల్పుల్లో అమరులైన ముద్దాడ గాంధీ, చిట్టిపంతుల చిరంజీవి, షేఖ్‌ ఇస్మాయల్‌, శ్రీరాములు, సూర్యనారాయణ త్యాగాలను స్మరించుకుంటూ అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఎమ్మెల్సీ శ్రీనివాసులునాయుడు, న్యాయాధికారులు మీనాదేవి, నాగమణి, సైనిక్‌స్కూల్‌ ప్రిన్సిపాల్‌ ఎస్‌.ఎస్‌ శర్మ, ఏఎస్పీలు సౌమ్యలత, నాగేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 22 , 2025 | 12:18 AM