భక్తిశ్రద్ధలతో నాగుల చవితి
ABN , Publish Date - Oct 25 , 2025 | 10:53 PM
నాగుల చవితిని జిల్లా ప్రజలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు.
- పుట్టల వద్ద ప్రత్యేక పూజలు
- జిల్లాలో వెల్లివిరిసిన ఆధ్యాత్మిక సందడి
నాగుల చవితిని జిల్లా ప్రజలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పుట్టల వద్దకు వెళ్లి పూజలు చేశారు. పుట్టల్లో పాలు, గుడ్లు వేశారు. చలిమిడితో పాటు బెల్లం, నువ్వులతో చేసిన చిమ్మిలిని నైవైద్యంగా సమర్పించారు. నాగేంద్ర చల్లగా చూడయ్యా అంటూ వేడుకున్నారు. అనంతరం బాణసంచా కాల్చారు. జిల్లా కేంద్రం పార్వతీపురంతో పాటు కురుపాం, సాలూరు, పాలకొండలో ఆధ్యాత్మిక సందడి వెల్లివిరిసింది. సాలూరులో మంత్రి గుమ్మిడి సంధ్యారాణి నాగుల చవితి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులతో కలిసి పుట్ట వద్ద పూజలు చేశారు. లోకాన్ని చల్లగా చూడాలని నాగేంద్రుడిని కోరుకున్నట్టు ఆమె తెలిపారు.
-ఆంధ్రజ్యోతి బృందం