Share News

పాలకుల తీరు సరికాదు

ABN , Publish Date - Jul 19 , 2025 | 12:01 AM

మండలంలోని జిందాల్‌ యాజమాన్యం కోసం పాలకులు పాకిస్థాన్‌ తరహా పాలన ఇక్కడ అమలు చేస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్‌ ఆరోపించారు.

పాలకుల తీరు సరికాదు

శృంగవరపుకోట రూరల్‌, జూలై 18(ఆంధ్రజ్యో తి): మండలంలోని జిందాల్‌ యాజమాన్యం కోసం పాలకులు పాకిస్థాన్‌ తరహా పాలన ఇక్కడ అమలు చేస్తున్నారని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్‌ ఆరోపించారు. శుక్రవారం ఆయన బొడ్డవర గ్రామంలో నిర్వాసితులతో కలిసి నిరసన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జిందాల్‌ కంపెనీ ఏర్పాటు సమయంలో అప్పటి కలెక్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రజాప్రాయ సేకరణలో భూములు ఇచ్చిన వారికి ఎన్నో హామీలు ఇచ్చారని, వాటిని మినిట్స్‌ రాసి అమలు చేస్తారని అప్పట్లో ప్రకటించారన్నారు. అయితే 18 ఏళ్లుగా కంపెనీ పెట్టకుండా నిర్వాసితులను మోసం చేస్తున్నారని అన్నారు. గత 26 రోజులుగా అహింసా మార్గంలో న్యాయం కోరుతుంటే పోలీసులు వారిపై బైండోవర్లు నమోదు చేయడం తగదన్నారు.

Updated Date - Jul 19 , 2025 | 12:01 AM