సామూహిక వంటశాలల ప్రతిపాదన రద్దు చేయాలి
ABN , Publish Date - Aug 10 , 2025 | 12:04 AM
:మఽధ్యాహ్న భోజన పథకంలో సామూహిక వంట శాలల ద్వారా భోజన పథకాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం, సీఐటీమూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి.
సాలూరు, ఆగస్టు 9(ఆంధ్రజ్యోతి):మఽధ్యాహ్న భోజన పథకంలో సామూహిక వంట శాలల ద్వారా భోజన పథకాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలను వెంటనే రద్దు చేయాలని మధ్యాహ్న భోజన పథకం కార్మిక సంఘం, సీఐటీమూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. శనివారం సాలూరులో ప్రభుత్వం ప్రతిపాదనలు వెంటనే విరమిం చాలని డిమాండ్‌చేస్తూ భోజనపథకం కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భం గా సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వైనాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో మఽధ్యాహ్న భోజన పథకం పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా వ్యవస్థ బలోపేతానికి దోహద మయ్యిందని తెలిపారు. విద్యార్థుల్లో రక్తహీనతలు తగ్గిందని తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు మెస్‌చార్జీలు పెంచాలని, వంటనిర్వాహకులకు జీతాలు పెంచాలని ఒక పక్క కార్మికులు ఆందోళన చేస్తుంటే, వారిసమస్యలు పరిష్కరించని ప్రభుత్వం ప్రైవేటు ఏజెన్సీలకు వంటలను అప్పగించాలనిచూస్తే పోరాటానికి వెనుకడుగువేయబోమని హె చ్చరించారు. ఈనెల పదోతేదీన భోజన నిర్వాహకుల సంఘం మహాసభలో భవిష్యుత్ కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో భోజననిర్వాహకుల సంఘ నాయకులు సీహెచ్ సుశీల, బి.సింహాచలం, కె.లక్ష్మి, కె.సీతమ్మ, సీతమ్మ, ఎస్.సబాన, పి. శ్రీదేవి పాల్గొన్నారు.