Share News

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:30 AM

వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9న సమ్మె చేస్తున్నట్టు సీఐటీయూ నాయకులు జి.వెంకటరమణ తెలిపారు.

ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలి

బెలగాం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): వైద్య ఆరోగ్య శాఖలో పని చేస్తున్న ఆశా వర్కర్లు తమ సమస్యలు పరిష్కరించాలని ఈనెల 9న సమ్మె చేస్తున్నట్టు సీఐటీయూ నాయకులు జి.వెంకటరమణ తెలిపారు. ఈ మేరకు ఆశా వర్కర్లతో కలిసి పట్టణంలోని జగన్నాథపురం పీహెచ్‌సీ, పార్వతీపురం పట్టణ ఆరోగ్యం కేంద్రం అధికారులు డా.విజయ్‌మోహన్‌, గణేష్‌ నాయుడులకు గురువారం సమ్మె నోటీసు అందజేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లా డుతూ ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ.26వే లు ఇవ్వాలని, పని భారం తగ్గించాలని డిమాం డ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్ల యూనియన్‌ జిల్లా కార్యదర్శి శివాని, నాయకు రాళ్లు పద్మ, భాగ్యం పాల్గొన్నారు.

ఫ మక్కువ, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ఆశా వర్క ర్ల సమస్యలు పరిష్కరించా లని సీపీఎం జిల్లా కార్యద ర్శి కొల్లి గంగునాయుడు డిమాండ్‌ చేశారు. గురువారం స్థానిక పీహెచ్‌సీ వైద్యాధికారి హరికృష్ణకు వినతిపత్రాన్ని అందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 9న జరిగిన సార్వత్రిక సమ్మెలో ఆశా వర్కర్లు పాల్గొంటున్నారని చెప్పారు. ఆశా వర్కర్ల యూనియన్‌ నాయకు లు అనిత, మండల వీఆర్‌ఏల సంఘం అధ్యక్షుడు పవన్‌ పాల్గొన్నారు.

Updated Date - Jul 04 , 2025 | 12:30 AM