పీసా చట్టం పకడ్బందీగా అమలుచేయాలి
ABN , Publish Date - Aug 06 , 2025 | 12:17 AM
33
పాలకొండ, ఆగస్టు 5 (ఆంధ్రజ్యో తి): ఆదివాసీల హక్కులను అమలు చేయాలని, పీసాచట్టం పకడ్బందీగా అమలుచేయాలని ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.తిరుపతిరావు, గిరిజన సంఘం నాయకులు ఆరిక భానుచందర్ డి మాండ్‌చేశారు. మంగళవారం మండ లంలోని మల్లంగూడలో ప్రపంచ ఆది వాసీ దినోత్సవం పురస్కరించుకుని సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీల హక్కులను అమలు చేయకుండా మోసగిస్తు న్నాయని ఆరోపించారు.కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు డి.రమ ణారావు, మండల కార్యదర్శి కె.రాము, డి.దుర్గారావు పాల్గొన్నారు.