వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Dec 23 , 2025 | 12:30 AM
అమటాం రాయవలస గ్రామానికి చెందిన జక్కా వెంకటరావు(61) ఆత్మహత్య చేసుకుని సోమవారం మృతి చెందినట్టు సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు.
భోగాపురం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): అమటాం రాయవలస గ్రామానికి చెందిన జక్కా వెంకటరావు(61) ఆత్మహత్య చేసుకుని సోమవారం మృతి చెందినట్టు సీఐ కె.దుర్గాప్రసాదురావు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరావు కూలి పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అయితే ఏడాది కిందట ఆరోగ్యం బాగోక ఆసుపత్రిలో చికిత్స పొందాడు. ఆరోగ్యం బాగుండాలంటే విశాంత్రి తీసుకోవాలని, మద్యం మానేయాలని వైద్యులు సూచించారు. దీంతో వెంకటరావు ఇంటి వద్దే ఉంటున్నాడు. కుమారుడు జక్కా మదుసూదనరావు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అయితే వెంకటరావు మళ్లీ మద్యం తాగడంతో కుటుంబీకులు ఎందుకు తాగావని ప్రశ్నించారు. దీంతో వెంకటరావు పురుగు మందు తాగి, అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబీకులు వెంటనే స్థానిక సుందరపేట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ వైద్యులు పరిశీలించి మృతి చెందినట్టు నిర్ధారించారు. దీనిపై కుటంబీకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్‌ఐ పి.సూర్యకుమారి దర్యాప్తు చేస్తున్నారని సీఐ తెలిపారు. మృతుడికి భార్య జక్కా తులసి, కుమారుడు, కుమార్తె ఉన్నారు.