నల్లరాయిగూడ వాసులు ఆదర్శంగా ఉండాలి
ABN , Publish Date - Aug 31 , 2025 | 12:03 AM
నల్లరాయిగూడ గ్రామస్థులు భవిష్యత్‌లో మరింత ఆదర్శంగా ఉండాలని కొత్తూరు సివిల్ న్యాయాధికారి కె.రాణి సూచించారు. నల్లరాయిగూడలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు.
భామిని, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): నల్లరాయిగూడ గ్రామస్థులు భవిష్యత్‌లో మరింత ఆదర్శంగా ఉండాలని కొత్తూరు సివిల్ న్యాయాధికారి కె.రాణి సూచించారు. నల్లరాయిగూడలో శనివారం నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో ఆమె మాట్లాడారు. వివాదరహిత గ్రామంగా నల్లరాయిగూడ పేరొందడం ఆనందంగా ఉందన్నారు. ఈ గ్రామాన్ని ప్రతిఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. బత్తిలి ఎస్‌ఐ జి. అప్పారావు మాట్లాడుతూయువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని అన్నారు