ముగిసిన పంచకుండాత్మక యజ్ఞం
ABN , Publish Date - Apr 25 , 2025 | 12:12 AM
బెల్లుపడ గ్రామంలో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఐదు రోజులుగా సాగు తున్న పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహామంత్ర యజ్ఞం ఘనంగా ముగిసింది.
ఇచ్ఛాఫురం, ఏప్రిల్ 24 (ఆంధ్రజ్యోతి): బెల్లుపడ గ్రామంలో త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి ఆధ్వర్యంలో ఐదు రోజులుగా సాగు తున్న పాంచాహ్నిక పంచకుండాత్మక శ్రీరామ తారక మహామంత్ర యజ్ఞం ఘనంగా ముగిసింది. గురు వారం ఉదయం మహా పూర్ణాహుతి, వేదాశీర్వచనం, శ్రీస్వామివారి అనుగ్రహ భాషణం జరిగింది. సాయం త్రం సుమారు 1500 మంది మహిళలు కలశాలతో జల విసర్జన యాత్రలో పాల్గొన్నారు. బెల్లుపడ గ్రామం నుంచి ఉప్పాడ వీధి, కార్జి వీధి, రథం వీధి మీదుగా మార్కెట్ జంక్షన్, దాసన్నపేట నుంచి పాత బస్టాండ్ వద్దకు చేరుకున్నారు. అక్కడి నుంచి ఊరే గింపుగా వెళ్లి... బాహుదా నదిలో కలశాలను నిమజ్జ నం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు, వివిధ ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు.