నూతన విద్యావిధానాన్ని రద్దు చేయాలి
ABN , Publish Date - Jul 12 , 2025 | 11:56 PM
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు అయ్యే వర కూ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ స్పష్టం చేశారు.
ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు రామ్మోహన్
ప్లీనరీ సమావేశాలు ప్రారంభం
విజయనగరం దాసన్నపేట, జూలై 12(ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం రద్దు అయ్యే వర కూ పోరాటాన్ని కొనసాగిస్తామని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు పి.రామ్మోహన్ స్పష్టం చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు నగరంలో శనివారం ప్రారంభమయ్యాయి. ఈసందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన విద్యా విధానంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారన్నారు. పాఠశాలలు మూతపడ్డాయన్నారు. అలాగే జీవో నెం.77ను రద్దు చేయాలని, వసతిగృహ భవనాలు నిర్మించాలని, మెస్ చార్జీలు పెంచాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ ప్రతినిధులు రాము, వెంకటేష్, శిరీష, రాజు, రమేష్, విద్యార్థులు పాల్గొన్నారు.