Share News

ప్రాణం తీసిన పొగమంచు

ABN , Publish Date - Dec 21 , 2025 | 11:51 PM

మెంటాడకు చెంది న బండారి స్వామినాయుడు(35) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు.

 ప్రాణం తీసిన పొగమంచు

  • డివైడర్‌ను ఢీకొని వ్యక్తికి గాయాలు

  • చికిత్స పొందుతూ మృతి

మెంటాడ, డిసెంబరు 21(ఆంధ్రజ్యోతి): మెంటాడకు చెంది న బండారి స్వామినాయుడు(35) అనే వ్యక్తి రోడ్డు ప్రమాదం లో తీవ్రంగా గాయపడి మూడురోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆదివారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న స్వామినాయుడు బొర్రా గుహల వద్ద జరుగుతున్న పనుల నిమిత్తం వెళ్లివస్తుంటాడు. ఇందులో భాగం గా ఈనెల 17న రాత్రి బొడ్డవరకు చేరుకునేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండ గా బొండపల్లి మండలం గొల్లుపాలెం వద్ద దట్టమైన పొగమంచు కారణంగా మలుపును గుర్తించలేక నేరుగా డివైడర్‌ను ఢీకొని పడిపోయాడు. తీవ్ర గాయా లయ్యాయి. ఆ సమయంలో ఎవరి రాకపోకలు లేకపోవడంతో పడిన చోటనే రాత్రంతా ఎముకలు కొరికే చలిలో నరకయాతన అనుభవించాడు. 18వ తేదీ ఉదయం జాతీయ రహదారి సిబ్బంది చావుబతుకుల మధ్య ఉన్న స్వామినా యుడును గుర్తించి బొండపల్లి పోలీసులకు సమాచారమిచ్చారు. ఈనేపథ్యంలో స్వామినాయుడును విజయనగరం ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించగా అక్కడ మూడు రోజులపాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతూ ఆదివారం కన్ను మూశాడు. మృతుడు స్వామినాయుడుకు భార్య గౌరి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబ పెద్ద మృతితో ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వం ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. బొండపల్లి ఎస్‌ఐ మహేష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Dec 21 , 2025 | 11:51 PM