Share News

గాయపడిన వ్యక్తి మృతి

ABN , Publish Date - Dec 18 , 2025 | 11:53 PM

ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందినట్టు పెదమానాపురం ఎస్‌ఐ ఆర్‌.జయంతి తెలిపారు.

గాయపడిన వ్యక్తి మృతి

దత్తిరాజేరు, డిసెంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిచెందినట్టు పెదమానాపురం ఎస్‌ఐ ఆర్‌.జయంతి తెలిపారు. ఆమె గురు వారం తెలిపిన వివరాల ప్రకారం.. ఈనెల 12న మండలంలోని ఎం.లింగాలవ లస గ్రామానికి చెందిన అలజంగి సన్యాసప్పడు(55)ను అదే గ్రామానికి చెందిన ఇనుముల సత్యనారాయణ ట్రాక్టర్‌తో వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సన్యాసప్పడుకు తీవ్ర గాయాలు కావడంతో వైద్యం నిమిత్తం విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సన్యాసప్పడు గురువారం మృతిచెందాడు. మృతుని కుమారుడు అలజంగి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Dec 18 , 2025 | 11:53 PM