న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదు
ABN , Publish Date - Dec 17 , 2025 | 12:16 AM
న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీకి చెందిన దళితులు స్పష్టం చేశారు.
భోగాపురం, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): న్యాయం జరిగేవరకూ దీక్ష విరమించేది లేదని ముంజేరు పంచాయతీ సిద్ధార్థ కాలనీకి చెందిన దళితులు స్పష్టం చేశారు. తమపై దాడికి నిరసనగా వారు ఈనెల 6వ తేదీ నుంచి స్థానిక మండల కార్యాలయాల కూడలిలో రిలే దీక్ష చేపడుతున్నారు. మంగళవారం నిర్వహించిన రిలే దీక్ష వద్దకు డీఎస్పీ ఆర్.గోవిందరావు చేరుకుని, స్వచ్ఛందంగా రిలే దీక్ష విరమించండి.. చట్టపరంగా న్యాయం చేస్తామని తెలిపారు. అయితే న్యాయం జరిగేంతవరకు దీక్ష విరమించేది లేదంటూ దీక్షాపరులు ఆయనకు స్పష్టం చేశారు. డిఎస్పీ వెంట ఎంపీడీవో డీడీ స్వరూపరాణి, ఎస్‌ఐలు వి.పాపారవు, పి.సూర్యకుమారి ఉన్నారు.