Share News

Poor houses: జూన్‌ 10 నాటికి ఇళ్లు పూర్తి చేయాలి

ABN , Publish Date - May 24 , 2025 | 12:18 AM

Poor houses: పేదల కోసం నిర్మిస్తున్న గృహాలన్నీ జూన్‌ 10 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ జీఎం, ఉత్తరాంధ్ర జిల్లాల హౌసింగ్‌ ప్రత్యేకాధికారి వెంకటరమణ ఇంజనీర్లను ఆదేశించారు.

Poor houses: జూన్‌ 10 నాటికి ఇళ్లు పూర్తి చేయాలి
లబ్ధిదారులతో మాట్లాడుతున్న గృహ నిర్మాణ సంస్థ జీఎం వెంకటరమణ

- గృహ నిర్మాణ సంస్థ జీఎం వెంకటరమణ

పార్వతీపురం, మే 23 (ఆంధ్రజ్యోతి): పేదల కోసం నిర్మిస్తున్న గృహాలన్నీ జూన్‌ 10 నాటికి పూర్తి చేయాలని గృహ నిర్మాణ సంస్థ జీఎం, ఉత్తరాంధ్ర జిల్లాల హౌసింగ్‌ ప్రత్యేకాధికారి వెంకటరమణ ఇంజనీర్లను ఆదేశించారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో హౌసింగ్‌ ఇంజనీరింగ్‌ అధికారులతో శుక్రవారం ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వచ్చే నెల 10 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల గృహాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు దీనిపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని అన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. గృహ నిర్మాణాలకు అవసరమైన ఇసుక, సిమెంట్‌, స్టీల్‌, ఇతర సామగ్రికి కొరత లేదన్నారు. నీటి సౌలభ్యం లేకపోతే వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. లబ్ధిదారులను ఉత్తేజపరిచి ముందుకు వచ్చేలా అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. బిల్లులు కూడా ఎప్పటికప్పుడు చెల్లింపులు జరుగుతున్నాయని, ఇటువంటి తరుణంలో గృహ నిర్మాణాలు మరింత వేగవంతం చేయాలని అన్నారు. ఈ సమావేశంలో కేఆర్‌ఆర్‌సీ ప్రత్యేక ఉప కలెక్టర్‌, హౌసింగ్‌ పీడీ పి.ధర్మచంద్రారెడ్డి, ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

- ఇళ్ల నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ జీఎం వెంకటరమణ లబ్ధిదారులకు సూచించారు. పార్వతీపురం మండలం నరిసిపురం లేఅవుట్‌ను ఆయన శుక్రవారం సందర్శించారు. అక్కడి లబ్ధిదారులతో కాసేపు ముచ్చటించారు. నిర్మాణాలు త్వరగా పూర్తి చేసుకోవాలని అన్నారు.

Updated Date - May 24 , 2025 | 12:18 AM