మహనీయుడు బిర్సా ముండా
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:34 PM
గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు.
విజయనగరం దాసన్నపేట, నవంబరు 15 ( ఆంధ్రజ్యోతి): గిరిజన హక్కుల కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా అని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఉప్పలపాటి రాజేష్ వర్మ అన్నారు. బిర్సా ముండా జయంతి సందర్భంగా పార్టీ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసినివాళులు అర్పించారు. గిరిజనుల భూమి, జీవన అధికారాలను రక్షించడానికి చేసిన పోరాటంతో బిర్సా ముండా చరిత్రలో చిరస్థాయిగా నిలిచారన్నారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పతివాడ రాజేష్, జిల్లా నాయకులు తదితరులు పాల్గొన్నారు.