Share News

మనవడే కాల యముడు

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:27 AM

జిల్లాలోని భోగాపురం పోలీ సుస్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ఎట్టకేలకు పోలీసు లు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

మనవడే కాల యముడు

విజయనగరం క్రైం, డిసెంబరు 22(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని భోగాపురం పోలీ సుస్టేషన్‌ పరిధిలో ఇటీవల జరిగిన వృద్ధురాలి హత్య కేసులో ఎట్టకేలకు పోలీసు లు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ ఏఆర్‌ దామోదర్‌ సోమవారం విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. భోగాపురం మండ లం ముడసలపేట గ్రామానికి చెందిన ముడసల అప్పియ్యమ్మ(70)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దొంగిలించుకుని పోయారని కోడలు లక్ష్మి ఈనెల 13న భోగాపురం పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నేర స్థలాన్ని క్లూస్‌టీం, డాగ్‌ స్వ్కాడ్‌ బృందాలు పరిశీలించాయి. ఎస్పీ ఆదేశాలతో డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి విచారణ చేపట్టారు. నేర స్థలం పరిశీలన సమయంలో డాగ్‌ స్క్వాడ్‌ ముడసల గౌరీ (మృతిరాలి కొడుకు కొడుకు) చుట్టూ తిరగడంతో పోలీసులు అనుమానంతో గౌరీపై నిఘా పెట్టారు. దొంగిలించిన వస్తువులను అమ్మేయాలన్న ఉద్దేశ్యంతో తీసుకు వెళ్తుండగా, భోగాపురం పోలీసులు ముడసల గౌరీని భోగాపురంలో అరెస్టు చేసి అతని వద్ద నుంచి 18.250 బంగారు ఆభరణాలను, 106 గ్రాముల వెండి పట్టీలను స్వాధీనం చేసుకున్నారు. తన నాన్నమ్మ(మృతురాలు) ఆమె కుమార్తె కుమారుడికి తన వద్ద ఉన్న డబ్బులు ఇచ్చేదని, తమ కుటుంబానికి ఇచ్చేది కాదని గౌరీ విచారణలో తెలిపాడు. మద్యం మత్తులో ఆమె ముఖంపై తలగడతో అదిమి, హత్య చేసి, ఒంటిపై ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దొంగిలించానని అంగీకరించాడు. ఎటువంటి అనుమానం రాకుండా ఉండేం దుకు మృతురాలు బహిర్భూమికి వెళ్లే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేసి, ఒంటిపై బంగారు వస్తువు లు తీసుకువెళ్లారని మభ్య పెట్టేందుకు మృతదేహాన్ని ఇంటి నుంచి బయటకు తీసుకుని వెళ్లి బావి సమీపంలో పడేశానని గౌరీ అంగీకరించాడు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన డీఎస్పీ గోవిందరా వు, భోగాపురం సీఐ దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐలు పాపారావు, లక్ష్మణరావు, ఎఎస్‌ఐ గౌరీశంకర్‌లను ఎస్పీ అభినందించి, నగదు రివార్డులను అందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ గోవిందరావు, సీఐలు దుర్గాప్రసాద్‌, ఎస్‌ఐలు పాపారావు, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:27 AM