అత్యున్నత విద్యాబోధనే ప్రభుత్వ లక్ష్యం
ABN , Publish Date - Oct 25 , 2025 | 12:21 AM
రాష్ట్రంలో విద్యార్థులందరికీ అత్యున్నత విద్యా బోధనను అందించ డమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
నెల్లిమర్ల, అక్టోబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో విద్యార్థులందరికీ అత్యున్నత విద్యా బోధనను అందించ డమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. వేణుగోపాలపురం ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ(డైట్)లో రూ.745.68 లక్షలతో నిర్మించనున్న సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ భవన సముదాయానికి ఆయన శుక్రవారం శంకుస్థాపన చేశారు. దీనిలో అత్యున్నత విద్యాశిక్షణను అందించేందుకు భారీ ఆడిటోరియం, సెమినార్ హాల్, లైబ్రరీ, అదనపు తరగతి గదులు, హాస్టల్ భవనాలను నిర్మించనున్నారు. అదే విధంగా రూ.65.25లక్షలతో నిర్మించిన నాలుగు తరగతి గదుల ను, రూ.61.10లక్షలతో నిర్మించిన ప్రహరీని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులకు అత్యున్నత శిక్షణ ఇవ్వడానికి, ఆధునిక బోధనా పద్ధతు లను నేర్పించడానికి సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఏడాది కాలంలోనే ఈ భవనాలను పూర్తి చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమం లో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులు నాయుడు, విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు, ఏఎంసీ చైర్మన్ కర్రోతు వెంకటనరసింగరావు, టీడీపీ నాయకుడు ఐవీపీ రాజు, డీఈవో యు.మాణిక్యంనా యుడు, సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, డైట్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.రామకృష్ణరావు, పలువురు కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు.