Share News

రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం

ABN , Publish Date - Apr 25 , 2025 | 11:55 PM

రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.శుక్రవారం మండలంలోని అప్పలగ్రహారం నుంచి మంతిన మల్లయ్యపేట వరకు, జీఎన్‌ పురం నుంచి బూరాడపేట వరకు, ఎంఆర్‌ అగ్రహారం నుంచి కొత్తూరు రామచంద్రపురం వరకు, శ్రీహరినాయుడుపేట జంక్షన్‌ నుంచి కొండగూడెం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయం
సంతకవిటి: మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌:

సంతకవిటి, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు.శుక్రవారం మండలంలోని అప్పలగ్రహారం నుంచి మంతిన మల్లయ్యపేట వరకు, జీఎన్‌ పురం నుంచి బూరాడపేట వరకు, ఎంఆర్‌ అగ్రహారం నుంచి కొత్తూరు రామచంద్రపురం వరకు, శ్రీహరినాయుడుపేట జంక్షన్‌ నుంచి కొండగూడెం వరకు బీటీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాదర్భార్‌ కార్యక్రమం నిర్వహించారు. తొలుత జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదదాడిని ఖండించి, రెండు నిమషాలు మౌనం పాటించారు. అనంతరం వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో టీడీపీనాయకులు కొల్ల అప్పలనాయుడు, కోండ్రు జగదీష్‌, వల్లూరు గణేష్‌, గట్టి భాను, రఘు, గురవాన నారాయణరావు, సమతం శ్రీను, చెలికాని మహేష్‌, రావు రవీంద్ర, దుప్పలపూడి శ్రీను, దూబ ధర్మారావు, మొయ్యి నారాయణప్పడు పాల్గొన్నారు.

మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా

రాజాం, ఏప్రిల్‌ 25 (ఆంధ్రజ్యోతి):రాజాంనుమోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా నని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి శ్యాంపురం క్యాంపు కార్యాలయంలో వంగర మండలం, రాజాం పట్టణ టీడీపీ అనుబంధ కమిటీల సభ్యుల తో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాజాం నియోజకవర్గం టీడీపీ పరిశీలకు డు సూరాడ చంద్రమోహన్‌, టీడీపీ పట్టణాధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, పిన్నింటి మోమన్‌రావు ,గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు పాల్గొన్నారు. అలాగే దేవదాయశాఖ పరిధిలోని ఆలయాల కేశఖండనశాలల్లోవిధులు నిర్వర్తించే నాయీ బ్రాహ్మణులకు కమీషన్‌ రూ.25వేలకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతోనాయీబ్రాహ్మణుల సంఘం నాయకులు మురళీమోహన్‌ను సన్మానించారు.

Updated Date - Apr 25 , 2025 | 11:55 PM