Share News

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ABN , Publish Date - May 13 , 2025 | 12:26 AM

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు.

రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

  • మంత్రి సంధ్యారాణి

సాలూరు, మే 12(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని స్త్రీ శిశు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. మామిడిపల్లి గ్రామంలో రూ.21 లక్షలతో నిర్మిస్తున్న ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘ భవనానికి ఆమె సోమవారం శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు రుణాలు, పెట్టుబ డులు అందించడంలో ఈ సంఘం తోడ్పడుతుందని, గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి ఇది మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, టీడీపీ మండల అధ్యక్షుడు ఆముదాల పరమేష్‌, డొంక అన్నపూర్ణమ్మ, బూస తవుడు, మత్స శ్యామ్‌ పాల్గొన్నారు.

Updated Date - May 13 , 2025 | 12:26 AM