రాష్ట్రాభివృద్ధే కూటమి లక్ష్యం
ABN , Publish Date - Jul 06 , 2025 | 12:18 AM
రాష్ట్రాభి వృద్ధే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నా రు.

బొబ్బిలి, జూలై 5 (ఆంధ్ర జ్యోతి): రాష్ట్రాభి వృద్ధే కూటమి లక్ష్యమని ఎమ్మెల్యే బేబీ నాయన అన్నా రు. తెలుగుదేశం పార్టీ సుపరిపా లనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా శనివారం ఆయన పట్టణంలోని 29వ వార్డులో పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ఏడాది పాలనలో చేసే సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టీడీపీ నాయకు లు అల్లాడ భాస్కరరావు, గెంబలి శ్రీనివాసరావు, సుంకరి సాయిరమేష్, చింతాడ రవి, ఎక్కుడు వాసు, మహ్మద్‌బాషా తదితరులు పాల్గొన్నారు.
బొబ్బిలి రూరల్: సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఎమ్మెల్యే బేబీనాయన శనివారం సీతయ్యపేట గ్రామంలో పర్యటించి, సంక్షేమ పథకాలపై ప్రచారం చేశారు.