రైతులకు అండగా ఉండడమే ధ్యేయం
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:07 AM
కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలబడాలన్నదే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని ఏఎంసీ ప్రాగంణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గొట్టాపు గౌరీ, వైస్‌చైర్మన్‌గా రౌతు వేణుగో పాలరావు, డైరెక్టర్లు కె.సన్యాసి, జి.పారినాయుడు, కె.మహందాతనాయుడు, కె.భవానీ, పి. రాంబాబు, పి.హిమబిందు, జి.రాములమ్మ, పి.స్వప్న, సి.హిమబిందు, ఆర్. చిన్నమ్మలు, ఎస్.హరిగోపాలరావు, పి.విజయ్‌కుమార్, జి.సాయిరామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వ హయాంలో రైతులకు అండగా నిలబడాలన్నదే ధ్యేయమని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర తెలిపారు. మంగళవారం పార్వతీపురంలోని ఏఎంసీ ప్రాగంణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా గొట్టాపు గౌరీ, వైస్‌చైర్మన్‌గా రౌతు వేణుగో పాలరావు, డైరెక్టర్లు కె.సన్యాసి, జి.పారినాయుడు, కె.మహందాతనాయుడు, కె.భవానీ, పి. రాంబాబు, పి.హిమబిందు, జి.రాములమ్మ, పి.స్వప్న, సి.హిమబిందు, ఆర్. చిన్నమ్మలు, ఎస్.హరిగోపాలరావు, పి.విజయ్‌కుమార్, జి.సాయిరామకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు.ఈ సందర్భంగా విజయచంద్ర మాట్లాడుతూ కూటమి వైసీపీ ప్రభుత్వం హయాం నుంచి నిలిచిపోయిన ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్ల పదవు లను కూటమి ప్రభుత్వంలో భర్తీ చేసినట్లు తెలిపారు. చైర్మన్, పాటు డైరెక్టర్లు రైతులకు అన్నివిధాలుగా సహకరించి, ఏఎంసీ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు.
ఫపార్వతీపురం రూరల్, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): అడ్డాపుశీల నుంచి వీఆర్‌ఎస్‌వలస, బాలగొడబ నుంచి వెంకటరాయుడిపేటకు నిర్మించిన రెండు బీటీ రోడ్లను ఎమ్మెల్యే విజయచంద్ర మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల అభివద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు.