ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:01 AM
ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. బొప్పడాం పంచాయతీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
నెల్లిమర్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయమని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. బొప్పడాం పంచాయతీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు. శనివారం రాత్రి మండలంలోని బొప్ప డాంలో మనప్రజలతో- మన ఎమ్మెల్యే కార్యక్రమం నిర్వహించారు.ఈ సంద ర్భంగా బొప్పడాంతోపాటు బుచ్చన్నపేటలో పర్యటించారు. గ్రామస్థులతో మాట్లాడుతూ సీసీ రోడ్లు, డ్రెయిన్లు, తాగునీరు, మౌలిక వసతులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జనసేన నాయకులు చనమల్లు వెంకటరమణ, కరుమజ్జి గోవిందరావు, టీడీపీ నాయకులు బొంతు వెంకటరమణ, అంబల్ల సత్యనారాయణ, అంబళ్ల అనసూయ, కోరాడరమేష్,అంబల్ల అప్పలనాయుడు, గోవిందరావు, గదల అచ్చెంనాయుడు, దుర్గాసి శేఖర్, సర్పంచ్ అంబల్ల కిరణ్, ఎంపీటీసీ పురుషోత్తం పాల్గొన్నారు.
రహదారిని అభివృద్ధిచేయాలి
భోగాపురం, వంబరు9(ఆంధ్రజ్యోతి): భోగాపురం నుంచి ముక్కాం వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిలో తుప్పలు తొలగింపు పనులను ఎమ్మెల్యే లోకంనాగమాధవి ఆదివారం పరిశీలించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డుకు ఇరువైపుల తుప్పలు పెరిగి పోవడంతో రాకపోకలు సాగించేవారికి ఇబ్బందికరంగా ఉందని తెలిపారు. వాహనచోదకులకు ఇబ్బందులుకలకుండా ఉండేలా తుప్పలు పూర్తిగా తొలగించి రహదారి అభివృద్ధి చేయాలని సూచించారు.