Share News

సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , Publish Date - Apr 10 , 2025 | 12:19 AM

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుం దని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు.

సమస్యల పరిష్కారమే ధ్యేయం

  • ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

  • ప్రజా దర్బార్‌లో వినతుల స్వీకరణ

గుమ్మలక్ష్మీపురం, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుం దని ప్రభుత్వ విప్‌, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. బుధవారం గుమ్మలక్ష్మీపురంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో ఆమె ప్రజదర్బార్‌ నిర్వహించారు. వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరిం చారు. సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుని వెళ్లి, పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యం

పార్వతీపురం రూరల్‌, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. వెంకంపేటలోని టీడీపీ నియోజకవర్గ కార్యాల యంలో బుధవారం ఆయన ప్రజాదర్బార్‌ నిర్వహించా రు. వినతిపత్రాలు స్వీకరించారు. సమస్యలను పరిష్కరిం చాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ఈసం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జంఝావతి ద్వారా పట్టణ ప్రజలకు తాగునీరు అందించేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. జంఝావతి హైలెవెల్‌ కెనాల్‌ పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరామన్నారు.

వంతెన పనులు పూర్తి చేయాలి

సీతంపేట రూరల్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): వెంపల గూడ నుంచి రేగులగూడ కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మి స్తున్న వంతెనను పూర్తి చేయాలని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ ఆదేశించారు. రేగులగూడలో బుధవా రం ఆయన ప్రజా దర్బార్‌ నిర్వహించారు. రేగులగూడ, రేగులగూడ కాలనీ, వెంపలగూడ గ్రామాల్లో పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వెంపల గూడ నుంచి రేగులగూడ కాలనీకి వెళ్లే మార్గంలో నిర్మిస్తు న్న వంతెనను పరిశీలించారు. నిర్మాణం పూర్తిచేయాలని ఆదేశిం చారు. ఏఎంసీ చైర్మన్‌ సంధ్యారాణి, నాయకులు సవరతోట మొఖలింగం, ప్రసాద్‌, పవన్‌ ఉన్నారు.

Updated Date - Apr 10 , 2025 | 12:19 AM