మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యం
ABN , Publish Date - Dec 28 , 2025 | 11:50 PM
మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు.
ఎమ్మెల్యే అదితి గజపతిరాజు
డిజి లక్ష్మీ కామన్ సర్వీస్ సెంటర్ ప్రారంభం
విజయనగరం రూరల్, డిసెంబరు 28(ఆంధ్రజ్యో తి): మహిళలకు స్వయం ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు అన్నారు. 30వ డివిజన్ పరిధిలోని ధర్మపురిలో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటైన డిజి-లక్ష్మీ కామన్ సర్వీస్ సెంటర్‌ను ఆమె ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పేద మహిళలకు డిజిటల్ నైపుణ్యంతో శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా డిజి-లక్ష్మీ కామన్ సర్వీస్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే డ్వాక్రా మహిళలతో మాట్లాడి, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అడిగి తెలుసుకున్నారు.