గిట్టుబాటు ధర కల్పించడమే ధ్యేయం
ABN , Publish Date - Dec 08 , 2025 | 11:20 PM
ww
వేపాడ, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శృంగవరపుకోట ఎమ్మెల్యే కోళ్ల లలితకు మారి తెలిపారు. సోమవారం మండలంలోని కొండగంగుబూడి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ రైతు పండించే ప్రతి గింజ ను ప్రభుత్వమే కొంటుందన్నారు. కార్యక్రమంలో ఏవో స్వాతి, టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి కొట్యాడ రమణమూర్తి, గొలగాని కృష్ణమూర్తి, వెంకటరావు, పరవాడ జగదీష్ ,ముమ్మలూరి సూర్యనారాయణ, సింహద్రి సత్తిబాబు పాల్గొన్నారు.