Share News

మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

ABN , Publish Date - Sep 18 , 2025 | 12:21 AM

మహిళల ఆరోగ్య సంరక్షణే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఎమ్మెల్యేలు అన్నారు.

మహిళల ఆరోగ్య సంరక్షణే లక్ష్యం

మహిళల ఆరోగ్య సంరక్షణే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల లక్ష్యమని ఎమ్మెల్యేలు అన్నారు. స్వస్థ నారీ సశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలను వారు బుధవారం ప్రారంభిం చారు.

నెల్లిమర్ల, సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి): నెల్లిమర్ల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో స్వస్థ నారీ సశక్తి పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే లోకం నాగమాధవి బుధవారం ప్రారంభించారు. ఈనెల 17 నుంచి వచ్చే నెల 2 వరకు జిల్లాలో పలు ప్రాంతాల్లో ఆరోగ్య శిబిరాలు జరగనున్నాయని ఎమ్మెల్యే వివరించా రు. నగర పంచాయతీ చైర్మన్‌ బంగారు సరోజిని, మాజీ డీసీసీబీ వైస్‌ చైర్మన్‌ చనమ్లు వెంకటరమణ, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ డైరెక్టర్లు మజ్జి రాంబాబు, దుర్గాశి శేఖర్‌, ఎంఎం నాయుడు పాల్గొన్నారు.

భోగాపురం: ప్రతి స్త్రీ ఆరోగ్యపరంగా బలంగా ఉండాలని ఎమ్మెల్యే లోకం నాగమాధవి అన్నారు. భోగాపురం సామాజిక ఆరోగ్య కేంద్రంలో బుధవారం స్వస్థ నారీ సశక్త్‌ పరివార్‌ అభియాన్‌ కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. తహసీల్దార్‌ రమణమ్మ, ఇన్‌చార్జి ఎంపీడీవో గాయత్రి తదితరులు పాల్గొన్నారు.

లక్కవరపుకోట: మహిళల ఆరోగ్యమే దేశానికి శ్రీరామరక్ష అని ఎమ్మెల్యే లలిత కుమారి అన్నారు. ఎల్‌.కోట పీహెచ్‌సీలో వైద్యుడు బి.అనీల్‌కుమార్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వస్త్‌ నారీ సశక్తి పరివార్‌ కార్యక్రమాన్ని ఆమె బుధవారం ప్రారంభించారు. మహిళల ఆరోగ్యం పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయని తెలిపారు. త్వరలో రూ.25 లక్షలఆరోగ్య బీమా అందుతుందని పేర్కొన్నారు. వైద్యుడు అజయ్‌కుమార్‌, ఏఎంసీ చైర్మన్‌ చొక్కాకుల మల్లునాయుడు, ఒబ్బిని సత్యనారాయణ, డైరెక్టర్‌ కళ్లద్దాల శ్రీను, కొట్యాడ రాము, ఇన్‌చార్జి ఎంపీడీవో దొర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 18 , 2025 | 12:21 AM