సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయం
ABN , Publish Date - Nov 12 , 2025 | 11:55 PM
ప్రతిఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయమని ఎమ్మెల్యేలు తెలిపారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తిచేసిన గృహాలను ఎమ్మెల్యేలు ప్రారంభించి లబ్ధిదారులకు అప్పగించారు.
ప్రతిఒక్కరికీ సొంతింటి కల నెరవేర్చడమే ధ్యేయమని ఎమ్మెల్యేలు తెలిపారు. బుధవారం జిల్లాలోని పలుచోట్ల ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తిచేసిన గృహాలను ఎమ్మెల్యేలు ప్రారంభించి లబ్ధిదారులకు అప్పగించారు.
ఫ విజయనగరం టౌన్, నవంబరు12 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ప్రతి పేదవాడికి సొంతిళ్లు ఉండాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు తెలిపారు. మండలంలోని దుప్పాడలో ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కాపు కార్పొ రేషన్ చైర్‌పర్సన్ పాలవలస యశస్వినితో కలిసి ప్రధానమంత్రి ఆవాస్ యోజన 1.0 కార్యక్రమంలో భాగంగా నిర్మాణం పూర్తిచేసినగృహాలను ప్రారంభించి లబ్ధిదారులకు అప్పగించారు.ఈ సందర్భంగా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మాట్లాడుతూ ఇళ్లు లేని పేదలకు స్థలాలను మంజూరుచేయడంతో పాటు,వాటి నిర్మాణాలకు రుణాలను కూడా ఇచ్చి లబ్ధిదారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పోలినాయుడు పాల్గొన్నారు.
ఫలక్కవరపుకోట(కొత్తవలస),నవంబరు12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలు కాలంలో మూడు లక్షల ఇళ్లు మంజూరుచేసి లబ్ధిదారులకు అందజేశామని ఎస్.కోట ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు. కొత్తవలస మండలంలోని మంగలపాలెంలో నూతన గృహాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పీవీ రత్నాజీ, కోళ్ల శ్రీను, బొబ్బిలి అప్పారావు, ఎల్లపు సూరిబాబు పాల్గొన్నారు.
ఫరాజాం, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి): ప్రతి పేదవాడికి 2029 నాటికి సొంతిళ్లు ఉండాలనే లక్ష్యంతో సీఎం చంద్రబాబునాయుడు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్ తెలిపారు. శ్యాంపురంలో నూతన గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ పట్టణాధ్యక్షుడు నంది సూర్యప్రకాష్‌రావు, రూరల్ అధ్యక్షుడు సుమల వెంకటమన్మఽథరావు, నారాయణరావు,లచ్చుభుక్త ధనలక్ష్మి,శాసపు రమేష్ కుమార్, సమతం శ్రీను, గణేష్, అప్పలనాయుడు పాల్గొన్నారు.