Share News

ఉగ్రవాదం అంతం కావడమే లక్ష్యం

ABN , Publish Date - May 09 , 2025 | 12:00 AM

పహల్గాం లో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య ఆపరేషన్‌ సిందూర్‌ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు,చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక ట రావు తెలిపారు.ఉగ్రవాదం అంతంకావడమే అంతిమలక్ష్యం కావాలన్నారు.

 ఉగ్రవాదం అంతం కావడమే లక్ష్యం
మాట్లాడుతున్న కళావెంకటరావు :

రాజాం, మే 8 (ఆంధ్రజ్యోతి): పహల్గాం లో ఉగ్రమూకల చర్యకు ప్రతిచర్య ఆపరేషన్‌ సిందూర్‌ అని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యు డు,చీపురుపల్లి ఎమ్మెల్యే కిమిడి కళావెంక ట రావు తెలిపారు.ఉగ్రవాదం అంతంకావడమే అంతిమలక్ష్యం కావాలన్నారు. గురువారం రాజాంలోఆయన విలేకరులతో మాట్లాడు తూ పర్యాటకుల మరణానికికారణమైన వారిపై ప్రతీకారం తీర్చుకోవడం నిజమైన నివాళిగా భావిస్తున్నామని తెలిపారు.భారత సాయుధ బలగాలు ఉగ్రవాదశిబిరాలపై మెరు పుదాడి చేసి గట్టి సమాధానం ఇచ్చాయని చెప్పారు.అమాయకులైన పర్యాటకులను బలి గొన్న ఘటన హృదయ విదారకమైనదని, దేశ సమగ్రతకు చిచ్చు పెట్టాలని చూస్తే సహించబోమని తెలిపారు. చేసిన పపానికి పాకిస్తాన్‌పై మూల్యం చెల్లించుకోక తప్పదని కళా హెచ్చరించారు.

Updated Date - May 09 , 2025 | 12:00 AM