టెట్ మినహాయింపు సాధనే లక్ష్యం
ABN , Publish Date - Dec 14 , 2025 | 11:36 PM
:టెట్ మినహాయింపు సాధనే లక్ష్యంగా కృషి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలి పారు.
విజయనగరం రూరల్, డిసెంబరు 14 ( ఆంధ్రజ్యోతి):టెట్ మినహాయింపు సాధనే లక్ష్యంగా కృషి చేస్తామని ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు తెలి పారు. నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఏర్పాటుచేశారు. ఎస్టీయూలో ఉన్న పలువురు ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఆదివారం నోబుల్ టీచర్స్ అసోసియేషన్‌లో చేరారు. విజయన గరంలోని ఎన్‌జీవో సంఘ భవనంలో జరిగిన కార్యక్రమానికి చిరంజీవిరావు ముఖ్య అతిఽథిగా హాజరయ్యారు. ఎస్టీయూ నుంచి నోబుల్ టీచర్స్ యూనియన్‌లో చేరేందుకు కీలక భూమిక వహించిన జోగారావు, చిప్పాడ సూరిబాబులు మాట్లాడుతూ ఉపాధ్యా యులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి నోబుల్ టీచర్స్ అసోసియేషన్ విశేష కృషిచేస్తుందన్న నమ్మకంతో తమతో పాటు పలువురు సంఘ నాయకులు, ప్రతినిధులు నోబుల్ టీచర్స్ అసోసియేషన్‌లో చేరామన్నారు.ఈసందర్భంగా నూతన కమిటీ ఎన్నికైం ది. విజయనగరం జిల్లా నోబుల్ టీచర్స్‌అసోసియేషన్ జిల్లా అధ్య క్షుడిగా కె.జోగారావు, ప్రధాన కార్యదర్శిగా గోవిందనాయుడు, రాష్ట్ర కౌన్సిలర్లగా చిప్పాడ సూరిబాబు, ఎం. మురళి, గౌరవాధ్యక్షుడిగా ఎం.చిరంజీవి నాయుడు, అసోసియేట్ అధ్యక్షుడిగా పి.రాంబాబు, ఉపాధ్యక్షులుగా జి.రవి, అదనపు కార్యదర్శిగా పడాల లక్ష్మణరావు, ఆర్థిక కార్యదర్శిగా పి.మహేష్, సీపీఎస్ కన్వీనరుగా బొబ్బిలి ఈశ్వరరావు, కార్యదర్శిగా జి.సత్యం, ఎ.నాగేశ్వరరావు, మహిళా కార్యదర్శులుగా కేవీఎల్ నాగేశ్వరరావు, పి.రాజ్యలక్ష్మి, డి.సరస్వతి ఎన్నికయ్యారు. వీరిని ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు, రాష్ట్ర కౌన్సిలరు చిప్పాడ సూరిబాబులు అభినందించారు.