Share News

బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం

ABN , Publish Date - Jul 09 , 2025 | 12:02 AM

బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగాటీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు.రాజాం మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు నేలమట్టమై నిరాశ్రయులుగా మిగిలిన బత్తిన సరోజిని కుటుంబాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరామర్శించారు.

బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయం
బాధితురాలికి నిత్యావసరాలు అందజేస్తున్న ఎమ్మెల్యే మురళీ మోహన్‌ :

రాజాం/ రూరల్‌, జులై 8 (ఆంధ్రజ్యోతి):బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగాటీడీపీ ప్రభుత్వం పనిచేస్తోందని రాజాం ఎమ్మెల్యే కోండ్రు మురళీ మోహన్‌ తెలిపారు.రాజాం మునిసిపాలిటీ పరిధిలోని 17వ వార్డులో ఇటీవల కురిసిన వర్షాలకు ఇల్లు నేలమట్టమై నిరాశ్రయులుగా మిగిలిన బత్తిన సరోజిని కుటుంబాన్ని ఎమ్మెల్యే మంగళవారం పరామర్శించారు.ఈ సందర్భంగా బియ్యం, నిత్యావసరాలతో పాటు రెడ్‌క్రాస్‌ అందజేసిన వంటపాత్రలను అందజేశారు. కా ర్యక్రమంలో నాయకులు కోండ్రు జగదీష్‌, గురవాన నారాయణరావు, దుప్పలపూడి శ్రీనివాసరావు, మరిపి జగన్మోహనరావు, గంధి గోపి, పద్మశ్రీ పాల్గొన్నారు.

ఫరాజాం, జూలై 8 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కంచరాం సమీపంలో డిగ్రీ, పాలిటెక్నిక్‌ కళాశాలలు ఏర్పాటు కోసం జీఎంఆర్‌ స్థలాన్ని ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్‌, జీఎంఆర్‌ సంస్థ ప్రతినిధులు మంగళవారం పరిశీలించారు. కార్య క్రమలో జీఎంఆర్‌ పీఏ రెడ్డి అన్నాంనాయుడు,టీడీపీనాయకులు నారాయణరావు, శ్రీనివాసరావు, జయరాం, వెంకటరమణ. వెంకటరావు, శాసపు రాజేష్‌కు మార్‌ పా ల్గొన్నారు సోపేరులో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి వెళ్లి కర్రపత్రాలను అందజేశారు. సోపేరులో మొక్కలు నాటారు.

Updated Date - Jul 09 , 2025 | 12:02 AM