మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
ABN , Publish Date - May 16 , 2025 | 12:28 AM
మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు.
పాలకొండ ఎమ్మెల్యే జయకృష్ణ
కుట్టుమిషన్ శిక్షణ కేంద్రాల ప్రారంభం
పాలకొండ, మే 15 (ఆంధ్రజ్యోతి): మహిళల ఆర్థికాభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. పట్టణంలో బీసీ కార్పొరేషన్ ద్వారా ఏర్పాటుచేసిన ఉచిత కుట్టు శిక్షణా శిబిరాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. నగర పంచాయ తీ కమిషనర్ రత్నరాజు, ఎంపీపీ బొమ్మాళి భాను, కూటమి నాయకులు కర్నేన అప్పలనాయుడు, గంటా సంతోష్, కొరికాన గంగునాయుడు తదితరులు పాల్గొన్నారు.
వీరఘట్టం: వీరఘట్టంలోని కనోసా ఆసుపత్రి ప్రాంగణంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 90 రోజుల ఉచిత కుట్టు శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే జయ కృష్ణ ప్రారంభించారు. ఎంపీడీవో వెంకటరమణ, టీడీపీ మండల అధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్క ర్, కూటమి నాయకుడు పి.కృష్ణమూర్తినాయుడు, మహిళా సమాఖ్య అధ్యక్షురాలు కె.లలితకుమారి పాల్గొన్నారు.
భామిని: మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థిక అభివృద్ధి చెంది సమాజంలో గౌరవం దక్కేలా చేయడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ అన్నారు. భామిని లో బీసీ కార్పొరేషన్ ద్వారా మహిళలకు కుట్టుమి షన్ శిక్షణను ఆయన గురు వారం ప్రారంభించారు. ఘనసరలో వ్యవసాయ అధికారి సింహాచ లం ఆధ్వర్యంలో వ్యవ సాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. 50 శాతం రాయితీపై వీటిని అందించారు. టీడీపీ నాయకులు బి.రామినాయుడు, ఎం.జగదీశ్వరరావు, భూపతి ఆనందరావు, ఏ.కేశవ, రాజేష్, పి.నాగేశ్వరరావు, ప్రసాద్ పాల్గొన్నారు.
అధికారులు తీరు మార్చుకోవాలి
భామిని: అధికారులు తమ తీరు మార్చుకకోపతే చర్యలు తప్పవని ఎమ్మెల్యే జయకృష్ణ ఎంపీడీవో కా ర్యాలయ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురు వారం ఆయన భామినిలో టైలరింగ్ శిక్షణా కేంద్రం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయ కులు మాట్లాడుతూ తమకు అధికారులు ఎటువంటి సమాచారం అందివ్వడం లేదని ఆయన దృష్టికి తీసు కువచ్చారు. దీంతో ఆయన అధికారులను ప్రశ్నించా రు. కొన్ని గ్రామాల్లో అసలు ఒక్కరినైనా ఎంపిక చే యకపోవడం, సమాచారం కూడా ఇవ్వక పోవడంపై ఆరా తీశారు. ఇలా అయితే వారు ఏవిధంగా పనులు చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.