Share News

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - May 10 , 2025 | 11:59 PM

రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ఆధ్వర్యంలో కురుపాంలో ఏర్పాటు చేసిన మహిళలు కుట్టమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు.

మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం
కుట్టుమిషన్‌ శిక్షణ ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

  • ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి

కురుపాం, మే 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వెనుకబడిన తరగతుల సహకార సంస్థ ఆధ్వర్యంలో కురుపాంలో ఏర్పాటు చేసిన మహిళలు కుట్టమిషన్‌ శిక్షణ కేంద్రాన్ని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి శనివారం ప్రారంభించారు. కురుపాం-2 పాఠశాలలో ఎంపీడీవో జె.ఉమామహేశ్వరి ఆధ్వర్యలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని, మాట్లాడారు. మహిళల ఆర్థికాభివృద్ధి లక్ష్యంతో బీసీ మహిళకు ప్రభుత్వం కుట్టుమిషన్‌ శిక్షణ ఇస్తుందన్నారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్‌తో పాటు కుట్టమిషన్‌ అందజేస్తారని తెలిపారు. ఈసందర్భంగా శిక్షణ ఇవ్వనున్న శ్రీటెక్నాలజీస్‌ కార్యక్రమ సమన్వయకర్త జి.రాజేష్‌ మాట్లాడుతూ ఈ శిక్షణ 90 రోజులు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు 96 మంది ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకున్నారని 120 మంది శిక్షణ పొందే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల కన్వీనర్‌ కేవీ కొండయ్య, మాజీ సర్పంచ్‌లు వెంపటాపు భారతి, ఆరిక విప్లవకుమార్‌, హిమరిక సుబ్బలక్ష్మి, మహిళలు, అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - May 10 , 2025 | 11:59 PM