Share News

గ్రామాల అభివృద్ధే ధ్యేయం

ABN , Publish Date - Jul 10 , 2025 | 12:18 AM

గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు.

గ్రామాల అభివృద్ధే ధ్యేయం
వెదుళ్లవలసలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే కళావెంకటరావు

  • ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు

గరివిడి, జూలై 9(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే కిమిడి కళావెంకటరావు అన్నారు. వెదుళ్లవలస గ్రామంలో బుధవారం సాయంత్రం తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా పర్యటించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రా మాల్లో తాగునీరు, సాగునీరు, తారు రోడ్ల నిర్మా ణం, ప్రభుత్వ పాఠశాలలకు పూర్తిస్థాయిలో తర గతి గదుల నిర్మాణం తదితర కార్యక్రమాలు చేపడుతున్నామ న్నారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని చెప్పారు. దీనివల్ల నిరుద్యోగ సమస్య తీరుతుం దన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్‌ కే.త్రిమూర్తులురాజు, టీడీపీ నేతలు పైల బలరాం, బలగం వెంకటరావు, సారిపాక సురేష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jul 10 , 2025 | 12:18 AM