రైతుల అభివృద్ధే ధ్యేయం
ABN , Publish Date - Jun 04 , 2025 | 12:06 AM
రైతుల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. మంగళవారం వీరఘట్టంలో రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు.
వీరఘట్టం, జూన్ 3(ఆంధ్రజ్యోతి):రైతుల అభివృద్ధే ప్రభుత్వం ధ్యేయమని పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ తెలిపారు. మంగళవారం వీరఘట్టంలో రైతులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విడతల వారీగా మిగిలిన రైతులకు కూడ పరిక రాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు. ప్రస్తుతం ప్రభుత్వం రైతులకు 24 గంటల్లోనే ధాన్యం డబ్బులు ఖాతాల్లో జమచేస్తోందని తెలిపారు.ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలుచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఏడీఏ రత్నకుమారి, ఏవో జె.సౌజన్య, టీడీపీ మండలాధ్యక్షుడు ఉదయాన ఉదయ్‌భాస్కర్, ఏఎంసీమాజీచైర్మన్ పొదిలాపు కృష్ణమూర్తినాయుడు, నీటి సంఘం అధ్యక్షులు చింత ఉమా, శ్రీనివాసరావు, టీడీపీ పట్టణాధ్యక్షులు జామి లక్ష్మీనారాయణ, బల్లా హరి పాల్గొన్నారు.