సారా రహిత గ్రామాలే ధ్యేయం
ABN , Publish Date - Mar 14 , 2025 | 12:29 AM
సారా రహిత గ్రామాలుగా తీర్చిది ద్దడమే ధ్యేయమని, ఇందుకోసం ప్రజలు సహకరించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామ చంద్రరావు పిలుపునిచ్చారు.

జియ్యమ్మవలస, మార్చి 13 (ఆంధ్ర జ్యోతి): సారా రహిత గ్రామాలుగా తీర్చిది ద్దడమే ధ్యేయమని, ఇందుకోసం ప్రజలు సహకరించాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ పి.రామ చంద్రరావు పిలుపునిచ్చారు.గురువారం చినమేరంగి దళిత వాడలో నవోదయం 2.0 కార్యక్రమ ప్రారంభోత్సవంలో భాగంగా ఎక్సైజ్ సీఐ పి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సారా తయారీ, రవాణా, అమ్మకాల వల్ల అనర్ధాలు, విధిస్తున్న శిక్షలను వివరించారు. అనంతరం గ్రామస్థులతోనవోదయం 2.0 ప్రతిజ్ఞ చేయించారు. కార్య క్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాథుడు, కురుపాం ఎక్సైజ్ సీఐ పి.శ్రీనివాసరావు, ఏఈఎస్ పి.జీవన్‌కిశోర్, ఎస్‌ఐ జె.రాజశేఖర్, సర్పంచ్ అల్లు రవణమ్మ పాల్గొన్నారు.