సమస్యల రహిత పార్వతీపురమే లక్ష్యం
ABN , Publish Date - Apr 22 , 2025 | 11:59 PM
సమస్య ల రహిత పార్వతీపురమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు.
ఎమ్మెల్యే విజయచంద్ర
వార్డుల్లో పర్యటన
పార్వతీపురంటౌన్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): సమస్య ల రహిత పార్వతీపురమే లక్ష్యంగా పని చేస్తున్నామని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గుడ్ మార్నింగ్ పార్వతీపురం కార్యక్రమంలో భాగంగా ఆయన మంగళవా రం పట్టణంలోని 9వ, 10వ వార్డుల్లో గల పలు వీధుల్లో పర్యటించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ దశాబ్దాలుగా పార్వతీపురం మున్సిపాల్టీలో పారిశుధ్య నిర్వహణ, తాగునీ టి సరఫరా సమస్యలు ఉన్నాయన్నారు. అందుకే గుడ్‌మా ర్నింగ్ పార్వతీపురంలో భాగంగా ఆయా వార్డుల్లో పర్యటి స్తున్నామని చెప్పారు. స్వచ్ఛసుందర పార్వతీపురాన్ని నిర్మించేందుకు మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యు ల సహకారం తీసుకుంటున్నామన్నారు. మున్సిపాల్టీలో 7 మురికివాడల్లో గల సమస్యలు పరిష్కరించేందుకు ప్రణా ళికలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికి కుళా యిలు ఏర్పాటు చేసేందుకు అధికారులను ఆదేశించామని చెప్పారు. సాధారణ, బుడా, 15వ ఆర్థిక సంఘం నిధుల ను ఖర్చు చేసి పార్వతీపురాన్ని ఆధునికీకరిస్తామని తెలి పారు. పారిశుధ్య నిర్వహణ సక్రమంగా జరిగేందుకు 30 వార్డుల ప్రజలంతా సహకరిం చాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు, డీఈ శ్రీనివాసరాజుతో పాటు మాజీ మున్సిపల్ వైస్‌చైర్మన్ జయ ప్రకాష్ నారాయణ, ఆయా వార్డుల కౌన్సిలర్లు పాల్గొన్నారు.
వెంకమ్మపేటలో ప్రజా దర్బార్
పార్వతీపురం రూరల్, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): పార్వతీపురం నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. మండలంలోని వెంకమ్మపేట పంచాయతీ పరిధిలో ఉన్న టీడీపీ నియోజకవర్గ కార్యాలయంలో ఆయన మంగళవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. పలువురి నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పార్వతీపురం, సీతానగరం, బలిజిపేట మండలాల్లో అనేక గ్రామాలకు పక్కా రహదారి పనులు జరిగే విధంగా నిధులు మంజూరు చేశామని చెప్పారు. ఇప్పటికే అనేక రహదారులు పూర్తయ్యాయన్నారు. పార్వతీపురం పట్టణ ప్రజలకు జంఝావతి ద్వారా తాగునీరు వచ్చే విధంగా కృషి చేస్తున్నట్టు ఎమ్మెల్యే చెప్పారు.