కుండపోత
ABN , Publish Date - May 22 , 2025 | 11:41 PM
భామిని, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది.
- భామిని, గుమ్మలక్ష్మీపురంలో భారీ వర్షం
- మొక్కజొన్న రైతులకు తప్పని పాట్లు
భామిని/గుమ్మలక్ష్మీపురం, మే 22 (ఆంధ్రజ్యోతి): భామిని, గుమ్మలక్ష్మీపురం మండలాల్లోని పలు గ్రామాల్లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. సుమారు నాలుగు గంటల పాటు ఏకధాటిగా వాన పడింది. దీంతో రోడ్లపై మురుగునీరు పొంగిపుర్లింది. వాహనదారులు భయంభ యంగా ప్రయాణాన్ని సాగించారు. నులకజోడు, లోహరజోల, నేరడి, పసుకుడి, భామిని, లివిరి, దిమ్మిడిజోల తదితర గ్రామాల్లో మొక్కజొన్న, నువ్వు పంటను కాపాడుకునేందుకు రైతులు పాట్లు పడ్డారు. ఆరు బయట ఎండబెట్టిన మొక్కజొన్న గింజలు వర్షానికి తడిసిపోకుండా వాటిపై టార్పాలిన్లు కప్పారు. గత నాలుగు రోజులుగా వాతావరణం మార్పులతో ఇబ్బందులు పడుతున్నట్లు రైతులు వాపోతున్నారు.