Share News

సుపరిపాలనలో తొలి అడుగు

ABN , Publish Date - Jun 24 , 2025 | 12:01 AM

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజధాని అమరావతిలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు.

 సుపరిపాలనలో తొలి అడుగు
సమావేశంలో పాల్గొన్న మంత్రి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ జగదీశ్వరి, ఎమ్మెల్యే విజయ్‌చంద్ర, కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి

- అమరావతిలో ప్రత్యేక సమావేశం

- హాజరైన జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు

పార్వతీపురం, జూన్‌ 23 (ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా రాజధాని అమరావతిలో సోమవారం సాయంత్రం సుపరిపాలనలో తొలి అడుగు పేరిట ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గడచిన ఏడాదిలో చేపట్టిన పాలనా సంస్కరణలు, తీసుకొచ్చిన మార్పులు, అందించిన సంక్షేమం, రాష్ట్రాభివృద్ధికి చేసిన కృషిని సమీక్షించారు. రెండో ఏడాదిలో ఏం చేయాలి.. ఎలాంటి కార్యక్రమాలు, లక్ష్యాలను చేపట్టాలో చర్చించారు. ఈ సమావేశానికి రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి, ప్రభుత్వ విప్‌ తోయక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయ్‌చంద్ర, జిల్లా కలెక్టర్‌ శ్యామ్‌ప్రసాద్‌, ఎస్పీ మాధవరెడ్డి, జాయింట్‌ కలెక్టర్‌ శోభిక, జీసీసీ చైర్మన్‌ కె.శ్రావణ్‌కుమార్‌ తదితరులు హాజరయ్యారు.

Updated Date - Jun 24 , 2025 | 12:01 AM