తుఫాన్ వచ్చినా పోరాటం ఆగదు
ABN , Publish Date - Oct 29 , 2025 | 12:14 AM
ఎన్ని తుఫాన్లు వచ్చినా తమ నిరసన దీక్ష ఆగదని జిందాల్ నిర్వాసితులు తెలిపారు.
ఎస్.కోట రూరల్, అక్టోబరు 28(ఆంధ్రజ్యోతి): ఎన్ని తుఫాన్లు వచ్చినా తమ నిరసన దీక్ష ఆగదని జిందాల్ నిర్వాసితులు తెలిపారు. మంగళవారం బొడ్డవర గ్రామం వద్ద తమ 130వ రోజు నిరసనలో భాగంగా వారు మాట్లాడా రు. తమకు న్యాయం చేయాల్సిన అధికారులు జిందాల్‌కు అనుకూ లంగా కోర్టులకు తప్పుడు నివేదికలు ఇవ్వడం బాధ కలిగిస్తుందన్నారు.