Share News

అందరి సాయంతో పండుగ విజయవంతం

ABN , Publish Date - Jun 02 , 2025 | 12:21 AM

సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మ వారి పండుగను గతనెల 18,19,20 తేదీల్లో అందరి సహకారంతో విజయవం తంగా నిర్వహించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

  అందరి సాయంతో పండుగ విజయవంతం
మాట్లాడుతున్న సంధ్యారాణి:

సాలూరు, జూన్‌ 1(ఆం ధ్రజ్యోతి): సాలూరు గ్రామ దేవత శ్యామలాంబ అమ్మ వారి పండుగను గతనెల 18,19,20 తేదీల్లో అందరి సహకారంతో విజయవం తంగా నిర్వహించినట్లు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. ఆదివారం సాలూరులో శ్యామలాంబ అమ్మవారి పండుగ విజ యోత్సవసభను నిర్వహించారు. తొలుత అమ్మవారి పండుగ విజయవంతం చేసేందుకు శ్రమించిన పారిశుధ్య కార్మికులు, విద్యుత్‌, వైద్య, ఆరోగ్య శాఖ, పోలీసుశాఖతోపాటు పలు శాఖలకు చెందిన ఉద్యోగులను సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మవారి పండుగ ప్రకటించినప్పటి నుంచి అన్నిశాఖలను సమన్వయం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం నుంచి కోట్లాది రూపా యల నిధులు సమకూర్చుకుని ముందుకువెళ్లినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌, పట్టణ టీడీపీ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు అక్కేన అప్పారావు, అనువంశిక ధర్మకర్త విక్రమచంద్ర సన్యాసిరాజు, కమిష నర్‌ డీటీవీ కృష్ణారావు, తహసీల్దార్‌ రవణ, ఎంపీడీవో పార్వతి, ప్రత్యేకాధికారి డాక్టర్‌ శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 12:21 AM