Share News

ఉపాధి హామీ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ABN , Publish Date - Dec 17 , 2025 | 12:22 AM

ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని పూర్తిచేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఏపీడీ రమామణి ఆదేశించారు.

ఉపాధి హామీ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

ఉపాధి హామీ లక్ష్యాన్ని పూర్తిచేయాలి

రామభద్రపురం, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకం లక్ష్యాన్ని పూర్తిచేయడానికి సిబ్బంది కృషి చేయాలని ఏపీడీ రమామణి ఆదేశించారు. మంగళవారం ఆమె స్థానిక మండల ఉపాధి హామీ పథకం కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఈ ఏడాది వేతనదారుల సంఖ్య పెంచాలన్నారు. అలాగే ఫాంఫాండ్స్‌, కంపోస్టు ఫిట్స్‌, గోశాలల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఇందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి అంచనాలు రూపొందించాలన్నారు. ఈ ఏడాది హార్టికల్చర్‌ కింద ఎన్ని ఎకరాలసాగు చేస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. మండలంలో 22 పంచాయతీల్లో జరుగుతున్న ఉపాధి పనులపై ఆరా తీశారు. రోజూ ఎంతమంది వేతనదారులు ఉపాధి పనులకు వస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా వందరోజులకు ఎన్ని కుటుంబాలను పని కల్పించడం తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో ఏపీవో త్రినాథరావు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న ఏపీడీ రమామణి

1111111111111111111111111111111111111111111111111

Updated Date - Dec 17 , 2025 | 12:25 AM