చికిత్స పొందుతూ వృద్ధుడి మృతి
ABN , Publish Date - Dec 19 , 2025 | 11:59 PM
అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి(70) విశాఖా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు.
భోగాపురం, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): అమటాం గ్రామానికి చెందిన కోరాడ సూరి(70) విశాఖా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందినట్లు సీఐ కె.దుర్గాప్రసాదరావు తెలిపారు. ఈ ఘటనపై ఆయన శుక్రవారం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కోరాడ సూరి గతంలో కుక్క కరవడంతో గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అయితే ఆరోగ్యం కుదిటి పడకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఈనెల 4వ తేదీన గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబీ కులు చికిత్స నిమిత్తం విశాఖ జిల్లా తగరపువలస ప్రైవేటు ఆసుపత్రికి తరలిం చి చికిత్స అందించారు. అనంతరం ఈనెల 16న చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతిచెందాడు. దీనిపై మృతుడి కుమారుడు కోరాడ సూరి ఫిర్యాదు చేయగా సీఐ కేసు నమోదు చేసి, ఏఎస్‌ఐ కె.తిరుపతి దర్యాప్తు చేస్తున్నారు.