Should Be Developed వికసిత్ జిల్లాగా తీర్చిదిద్దాలి
ABN , Publish Date - Apr 26 , 2025 | 11:56 PM
The District Should Be Developed జిల్లా పరిధిలో ఉన్న సవాళ్లను అధిగమించి వికసిత్ పార్వతీపురం మన్యంగా తీర్చిదిద్దాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు.
పార్వతీపురం, ఏప్రిల్ 26 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిధిలో ఉన్న సవాళ్లను అధిగమించి వికసిత్ పార్వతీపురం మన్యంగా తీర్చిదిద్దాలని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ సూచించారు. శనివారం కలెక్టరేట్‌లో సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ వినియోగం, అమలు తీరుపైన చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ... ఈ ఏడాది మార్చి వరకు వేతనాల ద్వారా సుమారు 322.75 కోట్లు, ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ కింద రూ. 203 కోట్లు వెచ్చించినట్లు తెలిపారు. నీటి నిర్వహణ కోసం అమృత సరోవర్ కింద 22 పనులకు గుర్తించామన్నారు. అదే విధంగా ఫాంపాండ్స్ తదితర అభివృద్ధి పనుల ప్రగతిని వివరించారు. గత ఐదేళ్ల వైసీపీ సర్కారు నిర్లక్ష్యం వల్ల జిల్లాలో జలజీవన్‌మిషన్ లక్ష్యాలు చేరుకోలేకపోయామన్నారు. ఈ సందర్భంగా జేజేఎం నిధులు వివరాలను తెలియజేశారు. గ్రామ సడక్ యోజన కింద చేపట్టబోయే రహదారుల పనులను తెలియజేశారు. జిల్లాలో మొత్తం 476 గ్రామాలకు సంబంధించి 428 కిలోమీటర్లు వరకు రహదారుల అనుసంధానం చేయాల్సి ఉందన్నారు. సీఎం గ్రామీణ సడక్‌యోజన కింద 154 గ్రామాలను రహదారులతో అనుసంధానం చేయాల్సి ఉందని తెలిపారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారి సమావేశానికి సకాలంలో రాకపోవడంతో అమరావతి వచ్చి వివరాలు అందించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, డీఆర్వో హేమలత, ఇన్‌చార్జి సబ్ కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు.