అన్నిరంగాల్లో అభివృద్ధి కూటమి ఘనతే..
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:27 AM
రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథ కాల అమలు ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు.
పార్వతీపురం, డిసెంబరు30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి, సంక్షేమ పథ కాల అమలు ఘనత కూటమి ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే విజయచంద్ర అన్నారు. మంగళవారం స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన టీడీపీ అరకు పార్లమెంట్ అధ్యక్షురాలు తేజోవతితో కలిసి మా ట్లాడారు. రాష్ట్రంలో తల్లికి వందనం, స్ర్తీశక్తి, అన్నదాత సుఖీభవ, ఏడాదికి మూడు ఉచిత సిలిండర్ల సమర్థంగా అమలు చేశామన్నారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లకు ఇప్పటి వరకూ రూ. 50 వేల కోట్లుపైగా వెచ్చించామన్నారు. మత్స్యకార భరోసా, నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం, ఆటో డ్రైవర్లకు ఆర్థిక భరోసా కల్పించా మన్నారు. అన్నా క్యాంటీన్లు, గీత కార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపు, వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆయా సామాజిక వర్గాలను ఆదుకున్న ఘనత కూటమిదేనన్నారు. మెగా డీఎస్సీ నిర్వహణ, కానిస్టేబుళ్ల నియామకాలు చేపట్టామన్నారు. రోడ్లకు మరమ్మతులు, కొత్త రోడ్ల ఏర్పాటు కూటమికే సాధ్యమైందన్నారు. జిల్లాలోని జంఝావతి, తోటపల్లి ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేశామన్నారు. రైల్వేజోన్ సాధన అంశాలపై ఎమ్మెల్యే వివరించారు. సమావేశంలో టీడీపీ నాయకులు నాయకులు గొట్టాపు వెంకటనాయుడు, గొట్టాపు వెంకట రమణ, జి.చంద్రమౌళి, బోను దేవీ చంద్రమౌళి, వేణు, మజ్జి వెంకటేష్, కోలా మధు, డాక్టర్ భాను ప్రసాద్, డైరెక్టర్ శంకర్ పాల్గొన్నారు.