రసాభాసగా కౌన్సిల్ సమావేశం
ABN , Publish Date - Dec 29 , 2025 | 11:43 PM
స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్ బంగారు సరో జిని అధ్యక్షతన సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది.
నెల్లిమర్ల, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో చైర్‌పర్సన్ బంగారు సరో జిని అధ్యక్షతన సోమవారం జరిగిన కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. 17వ వార్డు కౌన్సిలర్ అవ నాపు సత్యనారాయణ మాట్లాడుతూ సమస్యలపై తాము ఇచ్చే ఫిర్యాదులకు స్పందించకుండా ఇతరులు చెప్తే ఎలా స్పందిస్తారని ప్రశ్నించారు. స్పందించిన కమిషనర్ జనార్దనరావు మాట్లాడుతూ ఇకపై అలా జరగనివ్వనని హామీ ఇచ్చారు. సభ్యులు మొయిద శ్రీనివాసరావు, బూర సుజాత తదితరులు మాట్లాడు తూ నిధులున్నా పనులు జరగడం లేదన్నారు. సంక్రాం తి సమీపించిందని, అయినా వీధిలైట్లు వెలగడం లేదని, తాగునీరు సక్రమంగా సరఫరా కావడం లేదని, సీసీ రోడ్లు వెయ్య లేదని ఆరోపించారు. ఈసందర్భంగా సమా వేశంలో సంతకాలు చేయడానికి సైతం నిరాకరించారు. ఇదిలా ఉంటే పట్టణంలో ప్లాస్టిక్ నిషేధం సక్రమంగా అమలు చేయడం లేదని చైర్‌పర్సన్ సరోజిని ధ్వజ మెత్తారు. ఈ సందర్భంగా సమావేశంలో ప్రవేశపెట్టిన అజెండాలోని అంశాలను తిరష్కరిస్తున్నట్టు మెజారిటీ సభ్యులు ప్రకటించారు. సభ్యులకు కనీసం తెలియపర చకుండా పలు అంశాలను ఎందుకు చేర్చారని ప్రశ్నిం చారు. సమావేశం జరుగుతుండగానే వైస్ చైర్మన్ సముద్రపు రామారావు, వైసీపీ సభ్యులు, బీజేపీ సభ్యు డు మైపాడ ప్రసాద్ తదితరులు బయటకు వెళ్లిపోయారు.