Share News

నిరసనల హోరు ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

ABN , Publish Date - Dec 16 , 2025 | 12:23 AM

జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సోమవారం పలువురు ఫిర్యాదుదారుల ధర్నాలతో దద్దరిల్లింది.

నిరసనల హోరు ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్‌

విజయనగరం టౌన్‌, డిసెంబరు15(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ సోమవారం పలువురు ఫిర్యాదుదారుల ధర్నాలతో దద్దరిల్లింది. తమ సమస్య లను తీర్చాలంటూ కలెక్టరేట్‌ ఎదుట ధర్నాలను నిర్వహించారు. అలాగే నినాదాలు చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రాలను అందజేశారు.

బొడ్డవలస పంచాయతీలో చేర్చాలి

బొబ్బిలి మండలం బొడ్డవలస పంచాయతీని ఆనుకుని ఉన్న రిజర్వు ఫారెస్ట్‌లో 23ఏళ్లుగా నివాస ముంటున్న తమను ఆ పంచాయతీలో చేర్చాలని అక్కడి నివాసితులు కలెక్టరేట్‌ ఎదుట నిరసన చేపట్టా రు. తమపై సంబంధిత అటవీశాఖ అధికారులు ఇరవై ఏళ్ల కిందటే కేసులు పెట్టినప్పటికీ ఆ ప్రాంతాన్ని విడి చి పెట్టి వెళ్లకుండా అక్కడే నివాసం ఉంటున్నా మన్నారు. అంగన్వాడీ, రేషన్‌, ప్రభుత్వ విద్య కు నలభై మంది చిన్నారులు దూరంగా ఉంటున్నారు.. ప్రభుత్వ పథకాలను పొందలేక తాము ఇబ్బందులు పడుతున్నామని వాపో యారు. సుమారు 65 కుటుంబాలు రిజర్వు ఫారెస్ట్‌లో నివాసం ఉంటున్నారని, తమను బొడ్డవలస పంచాయతీలో చేర్చాలంటూ వారు నిరసన తెలిపారు.

దళితులపై దాడులు తగవు

బోగాపురం మండలం ముంజేరు గ్రామంలో దళితులపై దాడులు చేసిన వారిని తక్షణమే అరెస్టు చేయాలని ఆ గ్రామానికి చెందిన సిద్ధార్థ కాలనీ దళితు లు కలెక్టర్‌ వద్ద ధర్నాకు దిగారు. తమ గ్రామంలో దళి తులపై చిన్నచూపుతో పాటు సాంఘిక బహిష్కరణ చేపడుతున్నారని, దళితవాడకు ఉద్దేశ పూర్వకంగా మురికి కాలువను మల్లించిన వారిపై చర్యలు తీసుకో వాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Dec 16 , 2025 | 12:23 AM