Share News

ప్రాంతీయ భాషలపై కేంద్రం వివక్ష

ABN , Publish Date - Dec 14 , 2025 | 12:10 AM

తెలుగు ఇతర ప్రాంతీయ భాషలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోం దని ఏపీటీఎఫ్‌ ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయు డు ఆరోపించారు. శనివారం సాలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు.

 ప్రాంతీయ భాషలపై కేంద్రం వివక్ష
మాట్లాడుతున్న జోగినాయుడు:

సాలూరు రూరల్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలుగు ఇతర ప్రాంతీయ భాషలపై కేంద్రప్రభుత్వం వివక్ష చూపుతోం దని ఏపీటీఎఫ్‌ ఉమ్మడి విజయనగరం జిల్లా గౌరవాధ్యక్షుడు బంకురు జోగినాయు డు ఆరోపించారు. శనివారం సాలూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందీ, సంస్కృతి భాషల అభివృద్ధి కోసం పదేళ్లలో రూ. 2532.59 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. అదే సమయంలో తెలుగు, తమి ళం, కన్నడ తదితర భాషల అభివృద్ధికి కేవలం రూ.147.60 కోట్లు మాత్రమే కేటా యించడం దారుణమన్నారు. వివిధ రాష్ట్రాల్లో మాతృభాషల అభివృద్ధికి ఇప్పటికైన కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని పెద్దఎత్తున నిధులను విడుదల చేయాలని కోరారు. అలాగే విద్య కోసం బడ్జెట్‌లో రూ.ఆరు వెచ్చించాల్సి ఉండగా కేంద్రప్రభుత్వం 37 పైసలు మా త్రమే కేటాయించడం తగదన్నారు. విద్యకు సముచిత రీతిలో కేటాయింపులు పెంచి విద్యానాణ్యత పెంచితే దేశానికి ప్రయోజనం చేకూరుతుందన్నారు. ఆయనతో పాటు ఏపీటీఎఫ్‌ పట్టణ నేత లావుడి వెంకటేశ్వరరావు ఉన్నారు.

Updated Date - Dec 14 , 2025 | 12:10 AM